పదవి విరమణ అభినందన సభ కు హాజరైన జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు
శంకర్పల్లి ఏప్రిల్ 22(ప్రజాక్షేత్రం) శంకర్ పల్లి మండలంలో నందు ZPHS మహారాజ్ పేట్ GHM ఐ. సురేందర్ రెడ్డి పదవి విరమణ అభినందన సభకు విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సుసింధర్ రావు , మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ పిఆర్టియు టీఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు కన్నయ్య , గోవర్ధన్ యాదవ్ , ప్రధాన కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి PRTU పత్రిక సంపాదకులు జగన్మోహన్ గుప్తా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జె.సంజీవ్ రావు, రాష్ట్ర కార్యదర్శి బి. రాములు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గౌడ్ అభినందించి సన్మానించినారు. శంకర్ పల్లి మండల అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ త్వరలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇప్పించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యను సాధించి పెడతామని అంతే కాకుండా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు టెట్టు లేకుండానే ప్రమోషన్స్ వచ్చే విధంగా మండల శాఖ పక్షాన రాష్ట్ర శాఖకు ప్రాతినిధ్యం చేశామని సఫలీకృతం కావడానికి రాష్ట్ర శాఖ ప్రయత్నం చేస్తుందని ఉపాధ్యాయులకు తెలియజేశారు, ఇట్టి కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రాజశేఖర్ , ప్రధాన కార్యదర్శి సి. రాములు, గౌరవ అధ్యక్షులు కె. బాల్ రాజ్, రవికాంత్ రెడ్డి, మాణిక్యం, హరికృష్ణ, అంజిరెడ్డి,యాదయ్య, రవీందర్ రెడ్డి, బలరాం, శ్రీరాములు,ఆనందం, సిద్దేశ్వర్, శ్రీధర్ రెడ్డి, రమేష్ శాంతి మేడం,తదితరులు పాల్గొన్నారు