Praja Kshetram
పాలిటిక్స్

సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు  

 

సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించిన హరీష్ రావు

సీఎం సవాల్ ని  స్వీకరిస్తున్నా

సంగారెడ్డి, ఏప్రిల్ 24 (ప్రజాక్షేత్రం):అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. అని  మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.వారు మాట్లాడుతూ శుక్రవారం అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యి ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చెయ్యాలి. ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను మీరు చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం.

Related posts