తెలంగాణా లో ఉన్నది ప్రజా పాలన కాదు…
ముమ్మాటికీ రెడ్ల పాలనే…
రేవంత్ వల్లే కాంగ్రెస్ గెలిచింది అనేది అపోహ
ఇప్పటికైనా ఆయన కులతత్త్వం తగ్గించుకోవాలి
లేకుంటే రేవంత్ తో పాటు కాంగ్రెస్ గల్లంతు అవుతుంది
-ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, ఏప్రిల్ 24(ప్రజాక్షేత్రం):
తెలంగాణలో నడుస్తుంది ప్రజా పాలన కాదని ముమ్మాటికి ఇది రెడ్ల పాలన గాని రేవంత్ రెడ్డి తన రెడ్డి వైఖరి మార్చుకోకపోతే ఆయన మునిగడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… తెలంగాణలో రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేది వాస్తవం కాదని కేవలం కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత వారి కుటుంబం పై ఉన్న అవినీతి ఆరోపణలకు విసుగు చెందిన తెలంగాణ ప్రజలు తప్పని పరిస్థితుల్లో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారన్నారు.. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ లో పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఒక ఇంట్లో ఇద్దరికీ టికెట్టు ఇవ్వడం అనేది ఉదయపూర్ డిక్లరేషన్ లో లేనప్పటికీ తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టిందని నేడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టి, బీసీలకు ఒక న్యాయం రెడ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీసీలకు ఇవ్వాల్సిన టికెట్లు రెడ్లకు… మాదిగలకే ఇవ్వాల్సిన టికెట్లు మాలలకు ఇచ్చి జనాభాలో అత్యధిక శాతం ఉన్న వర్గాలకు అన్యాయం చేశాడని విమర్శించారు. ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు. తన తర్వాత సీఎం గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడని ప్రకటించిన రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి ఉన్న భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రులుగా ఉన్న కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ లాంటివాళ్ళు సీఎం పదవికి అర్హులుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీన్నిబట్టి రేవంత్ రెడ్డిలో రెడ్డి కులతత్వం ఎంత ఉందో అర్ధమవుతుందని ఇప్పటికైనా ఆయన తన కులతత్వ వైఖరి మార్చు కోవాలని సూచించారు. రేవంత్ రెడ్డికి కులతత్వం బాగా పెరిగింది అది వెంటనే తొలిగించుకోవాలి.ఇలానే ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్ అడ్రెస్ లేకుంటా పోతది. కులపట్ల అభిమానం ఉండొచ్చు కానీ కులతత్వం ఉండొద్దు కులతత్వ పోకడల వాళ్ళ తీసుకుంటున్న నిర్ణయాలు ద్వారా అన్ని వర్గాలకి దూరం అవుతున్నాడు మొదటి రోజు నుంచి ఇంటలిజెన్స్ నుంచి మొదలుకొని అన్ని కీలక ఆఫీసర్ నియామకం లో రెడ్డి కూలతత్వమే కనిపిస్తుంది. ఒక్క సింగల్ కాస్ట్ కి ఎంపీ , ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారా ?అగ్రకులలలో బ్రాహ్మణా ,కమ్మ ,వెలమ వాళ్ళకి అవకాశాలు ఇచ్చారా నా తరవాత సీఎం గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హులు అని రేవంత్ రెడ్డి అన్నారు .. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అర్హులు అని చెప్పాడు.