Praja Kshetram
పాలిటిక్స్

బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

ఉద్యమకారుడు మున్నూర్ రవి కాంగ్రెస్ లో చేరిక

మహబూబ్ నగర్ ఏప్రిల్ 24 (ప్రజాక్షేత్రం): బి ఆర్ ఎస్ పార్టీ కి ఈరోజు భారీ షాక్ తగిలింది. తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మున్నూరు రవి, మాజీ డీసీసీ మీడియా సెల్ నాయకులు పటేల్ వెంకటేష్ ముదిరాజ్, టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ పాపిశెట్టి చంద్రకాంత్ గుప్తా, ముదిరాజ్ సేవా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముసంగి శ్రీధర్ బాబు ముదిరాజ్ ,విద్యార్థి నాయకులు పోల శ్రీశ్రీ, రంజిత్ ,మల్లికార్జున్ ,పసుపు నూరి సాయి కృష్ణ, తో సహా మరికొందరు విద్యార్థి యువజన నాయకులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డిల్లి లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎపి జితేందర్ రెడ్డి, ఎంపి అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Related posts