సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.
కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన కేసీఆర్.
మిర్యాలగూడ ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం): ఈ సందర్భంగా మాట్లాడుతూ.గురువారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్లీ మీ ముందుకు రావడం జరిగింది. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. నాలుగైదు నెలల కిందట ధీమాగా ఉన్న రైతు ఈ రోజు దిగాలుపడి చాలా బాధలో ఉన్నాడు. ఆ నాడు నేను నీళ్ల కోసం, నిధుల కోసం, కరెంటు కోసం, మన ప్రజల కోసం ఉద్యమిస్తే.. 15 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం’ అన్నారు.
‘ప్రజలను ఎందుకు బాధలుపెడుతున్నరు? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయ చేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? మిషన్ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్ ఏరియాలో.. మున్సిపల్ ఏరియాలో అన్నివర్గాల పేదలకు దొరకాలని ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చాం. ప్రతి ఇంట్లో నల్లా బిగించి ప్రతి ఇంటికీ నళ్లా నీరందించాం. ఇవాళ మిషన్ భగీరథ ఎందుకు నడుపలేకపోతున్నరు. మీ తెలివితక్కువ తనం ఏందీ? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఆ నాడు నీళ్లకోసమే గోస. నాలుగైదు నెలలకే.. కేసీఆర్ పక్కకు జరుగంగనే ఎందుకు మాయమై పోయినయ్ ? ఎందుకు బాధపడుతున్నరు ? సమాధానం చెప్పాలి’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.జై తెలంగాణ, జై కేసీఆర్, మన అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేద్దాం,తెలంగాణ బలం,దళం, గళం, డిల్లీ పార్లమెంట్ లో వీనిపిద్దాం.