Praja Kshetram
తెలంగాణ

ఈనెల 27న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల మాదిగ విద్యార్థుల సదస్సును జయప్రదం చేయండి

ఈనెల 27న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల మాదిగ విద్యార్థుల సదస్సును జయప్రదం చేయండి

ఎం ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మాదిగ

శంకర్ పల్లి ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం): గురువారం విలేకర్ల సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సి రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అందుకు సహకరిస్తున్న భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడకి కృతజ్ఞతగా మాదిగ విద్యార్థులు బీసీ విద్యార్థులు ఉపకుల విద్యార్థులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం నరేంద్ర మోడీ హైదరాబాదులో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు విచ్చేసి మీకు తోడుగా ఉంటాడని తెలియజేయడమే కాకుండా కేంద్రంలో క్యాబినెట్ శాఖ అధిపతులతో కమిటీ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా తీర్పును రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది త్వరలో ఈ తీర్పు సానుకూలంగా రావాలని వచ్చే విధంగా కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరోసారి కేంద్రంలో గెలిపించడం కోసం అందరూ నడుము కట్టాలని పిలుపునిచ్చారు‌
30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ పోరాటానికి ఇప్పటికైనా న్యాయం చేకూరుతుందని ఆశ వ్యక్తం చేస్తున్నట్లు అందులో భాగంగానే 27వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థుల సదస్సుకు మన రంగారెడ్డి జిల్లా నుంచి అధికంగా తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం లో ఎం ఏస్ ఎఫ్ నాయకులు శ్రీధర్, శంకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Related posts