KCR | ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. మహిళలకు రూ.2500 ఇస్తమన్నరు. గృహజ్యోతితో అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రంపోయిందని ఇవాళ జనం మొత్తుకుంటున్నరు. ఆడపిల్లలకు, యువతులకు, చదువుకునే పిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు రాలేదు కానీ.. లూటీలు మాత్రం వస్తున్నయ్’ అంటూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత విరుచుకుపడ్డారు.
KCR | ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. మహిళలకు రూ.2500 ఇస్తమన్నరు. గృహజ్యోతితో అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రంపోయిందని ఇవాళ జనం మొత్తుకుంటున్నరు. ఆడపిల్లలకు, యువతులకు, చదువుకునే పిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు రాలేదు కానీ.. లూటీలు మాత్రం వస్తున్నయ్’ అంటూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత విరుచుకుపడ్డారు. భువనగిరిలో బీఆర్ఎస్ అధినేత బస్యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పేదపిల్లలు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశాం. రాజశేఖర్రెడ్డి ప్రారంభిస్తే.. కాంగ్రెస్ చేసిందని మేం ఆపలేదు. దాన్ని కొనసాగించాం.. అందరూ పిల్లలకు ఇచ్చాం. అన్ని కులాలకు ఇచ్చాం. ఇంకా మీది నుంచి 1100 గురుకులాలు పెట్టినం. బ్రహ్మాండంగా పిల్లలు చదువుకొని కలెక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారు’ అని గుర్తు చేశారు.
ఇదేనా జరగాల్సిన పద్ధతి..?
‘ఇవాళ ఒక్క ప్రైవేటు కాలేజీకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఐదునెలలాయే కాలేజీల్లో జీతాలు ఇవ్వడం లేదు. మరి పిల్లలకు సదువు ఎట్ల చెబుతరు. పరీక్షలు ఎట్ల అవుతయ్.. ఆగమాగం చేశారు. గురుకులాలు పెడితే పిల్లలకు కల్తీ అన్నం పెడుతున్నరు. 135 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లోపడ్డరు. నలుగురు పిల్లలు చనిపోయారు. ఇదే భోనగిరిలో ఓ అమ్మాయి చనిపోయింది. ఇదేనా జరగాల్సిన పద్ధతి ? చేనేత కార్మికుల త్రిఫ్ట్ పథకం తీసుకువచ్చాం.
సగం ధరకే రంగులు, రసాయనాలు ఇచ్చాం. వాళ్ల బతుకులను కాపాడాం. మరి ఇవాళ అదికూడా బంద్పెట్టారు. ఇంకేమంటున్నరు ? నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామన్నారు.. ఎవరికైనా వచ్చిందా? జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? మెగా డీఎస్సీ ప్రకటించారా? అంతా బోగస్సే. ఇవన్నీ పోను వరికి ఏమిస్తామన్నరు ? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు.. రూ.500 బోనస్ ఇస్తామన్నరు. బోనస్ ఇచ్చారా? కానీ ఏం చెబుతున్నరు. భోనగిరికి వచ్చి యాదగిరి నర్సన్న మీద ఒట్టు. వచ్చేతాపకు ఇస్తరట. నమ్మేట్టు ఉన్నదా?’ అంటూ ప్రశ్నించారు.
తులం బంగారం తుస్సుమన్నదా..?
‘చివరగా రైతుల గురించి ఒక మాట. ఆనాడు మనం చేస్తామని రూ.30వేలకోట్లు రెండుసార్లు మాఫీ చేశాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు. ఉరుకండి.. లగెత్తండి.. జల్దిపోయి రూ.2లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9న నాడు 10.30గంటలకే సంతకం.. మొత్తం రూ.2లక్షల మాఫీ అన్నడు. మరి రెండులక్షల రుణమాఫీ అయ్యిందా? కేసీఆర్ కల్యాణలక్ష్మికి రూ.లక్ష ఇస్తున్నడు. దానికి సోపతి తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? తులం తుస్సుమన్నదా? బోనస్ బోగస్ అయ్యిందా? నేను చెప్పేది నిజమేనా?’ అని ప్రశ్నించారు.
మహిళలకు రూ.2500 వచ్చినయా?
‘ఇంకా ఏం చెప్పారు. 420 హామీలు ఇచ్చారు. హామీల్లో మహిళలందరికీ నెలకు రూ.2500 ఇస్తామన్నరు. ఏ మహిళకైనా రూ.2500 వచ్చాయా ? ఇవాళ గృహజ్యోతి విద్యుత్.. అన్నవస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రంపోయిందని.. ఇవాళ జనం మొత్తుకుంటున్నరు జనం. అన్నకు రూ.800 బిల్లు వచ్చేది. ఇవాళ రూ.1500, రూ.1600 బిల్లుపడుతుందని మొత్తుకుంటున్నరు. అది ఫెయిల్ చేశారు. ఆడపిల్లలకు, యువతులకు, చదువుకునే వారికి స్కూటీలు కొనిస్తామని అన్నరు. స్కూటీలు వచ్చినయా? స్కూటీలు రాలేదు కానీ.. లూటీలు మాత్రం వస్తున్నయ్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.