రేవంత్ రెడ్డిని బ్రోకర్ అంటూ మంద కృష్ణ విమర్శ
వరంగల్, ఏప్రిల్ 26 (ప్రజాక్షేత్రం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమం చేసి సీఎం కాలేదని.. బోకరిజం చేస్తూ సీఎం అయ్యారని కామెంట్స్ చేశారు. ప్రజాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయేవాడు కాదన్నారు. కడియం శ్రీహరిని తానే పిలిచాను అని రేవంత్ అన్నారని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలో చేరితే పిచ్చి కుక్కల్లా రాళ్లతో కొట్టామని రేవంత్ రెడ్డి చెప్పారని… ఇప్పుడు కడియంను కొట్టాల్సిందే కదా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరిని రాజీనామా చేయనీయకుంటే రాళ్లతో కొట్టాల్సి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరిలపై ఎవరైనా రాళ్ళు వేయొచ్చు అని వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కులం ఎస్సీ కాదని చెప్పిందే రేవంత్ రెడ్డి అని తెలిపారు. ఎస్సీ కాకుండానే ఎస్సీ సర్టిఫికెట్ తీసుకున్నారని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారన్నారు. కడియం శ్రీహరి ఎస్సీ కానప్పుడు కడియం కావ్య ఎలా ఎస్సీ అవుతుందని మందకృష్ణ మాదిగ నిలదీశారు.