Praja Kshetram
తెలంగాణ

ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి నాయకులు

శంకర్ పల్లి ఏప్రిల్ 26 (ప్రజాక్షేత్రం): పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, శంకర్ పల్లి కి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు.శుక్రవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఒక్క ఓటరు ను కలుస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాలను క్షుణ్ణంగా వివరిస్తూ, మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వం లోని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని, సుస్థిర పాలన కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని వివరించారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా నరేంద్ర మోడీ బలపరిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందామని, ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మునిసిపల్ అధ్యక్షులు బీర్ల సురేష్‌ ఇన్చార్జి వాసుదేవ్ కన్నా తదితరులు పాల్గొన్నారు.

Related posts