Praja Kshetram
తెలంగాణ

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి ఎంపిపి శంకర్ పల్లి

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి
ఎంపిపి శంకర్ పల్లి

 

శంకర్ పల్లి ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం) : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శంకరపల్లి మండలంలో కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జెండాను ఎగురవేసి జై తెలంగాణ అనే నినాదాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అని తెలంగాణ ప్రజలకు మంచి జరిగేది కేవలం టిఆర్ఎస్ పార్టీతోనే అని, కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు రైతులు బాధపడుతున్నారు అని ఆయన అన్నారు. మండల టిఆర్ఎస్ అధ్యక్షులు కావాలి గోపాల్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ప్రజల కోసమే కష్టపడుతుంది అని బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు రైతుబంధు కష్టాలు లేవని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళింది అని ,కరెంటు కష్టాలు తప్పడం లేదు అని, రైతుబంధు కూడా అందరికీ అంద లేదు అని ఆయన అన్నారు. శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామం లో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సొసైటి ఛైర్మెన్ భద్దం శశిధర్ రెడ్డి,మార్కెట్ ఛైర్మెన్ పాపరావు,సీనియర్ న్యాయవాది పట్లోల్ల ఉపేందర్ రెడ్డి,మహలింగాపురం ఎంపిటిసి యాదగిరి,పార్టీ నాయకులు మాణిక్య రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,దండు సంతోష్,రాఘవేందర్,వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts