కొండ విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన సింగపూర్ యువకులు
శంకర్ పల్లి ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం):నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పని చేస్తుననారన్నారని చేవెళ్ల లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీ సింగాపురం వార్డుకు చెందిన సుమారు 50 మంది యువకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇప్పుడిప్పుడే యువతీ యువకులకు అవగాహన ఏర్పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపించిన నిధులను తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇటీవల బీజేపీలోకి భారీగా చేరికలు పెరిగాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, మోడీకి ఓటు వేయాలన్నారు. కాబట్టి చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు ఓటు శాతం పది రెట్లు పెంచి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపిని గెలిపించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.
లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తనకు దక్కనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తామంతా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపులో భాగం కావాలన్ని లక్ష్యంతోనే బీజేపీలో చేరామని పార్టీలో చేరిన యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.