Praja Kshetram
తెలంగాణ

ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

 

ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

 

మహబూబాబాద్ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు.70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాలు తాత, నానమ్మ పెళ్లి చేయాలని మనుమడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి నిర్వహించారు.వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండాలోని జనం అందరూ తరలివచ్చారు.

Related posts