రాజకీయ పార్టీలకు లక్ష్మీనారాయణ సవాల్
ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రాష్ట్ర అప్పులు, ఆస్తులు కూడా పెట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు.అలాగే స్టాంప్ పేపర్లపై తమ హామీలను రాసివ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు.రౌడీయిజం లేని రాష్ట్రం తీసుకువస్తానని తాను స్టాంప్ పేపర్పై రాసిస్తానని ప్రకటించారు. యువతకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు.
