చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేనా భీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు..
మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి 100 మంది కార్యకర్తలు చేరారు
మొయినాబాద్ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరుగారంటీలను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చిల్కూర్ మాజీ సర్పంచ్ అండ్రుతో పాటు భారీగా చేరికలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా భావించి పార్టీలో చేరుతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేస్తుందని ప్రజల పాలన అందిస్తుందని చెప్పారు.
మన చేవెళ్ళ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి నీ అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని దానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.