Praja Kshetram
జాతీయం

రిజర్వేష‌న్ల‌పై ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రిజర్వేష‌న్ల‌పై ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 

నూ ఢిల్లీ ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): సంఘ్ ప‌రివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌ద్దుత‌గా నిలుస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆరెస్సెస్ రిజ‌ర్వేష‌న్ల‌కు అనుకూల‌మైనా కొంద‌రు సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు వీడియోలతో దుష్ప్ర‌చారం సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆరెస్సెస్ రిజర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకమ‌ని ఓ వీడియోను కొంద‌రు స‌ర్క్యూలేట్ చేస్తున్నార‌ని, ఇది పూర్తిగా అవాస్త‌మ‌ని తోసిపుచ్చారు. రాజ్యాంగం ప్ర‌కారం అమల్లో ఉన్న రిజ‌ర్వేష‌న్ల‌కు తామెన్న‌డూ వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేద‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందేన‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

Related posts