రంజిత్ రెడ్డి భారీ విజయానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి: శంకర్‌పల్లి మండల పిఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి
శంకర్‌పల్లి ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి భారీ విజయానికి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని శంకర్‌పల్లి మండల పిఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి మహాలింగాపురం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఎడ్ల బండి పై రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ఓటర్లకు వివరించి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కోసమైనా చేవెళ్ల ఎంపీ స్థానాన్ని గెలిపించుకోవాలని కోరారు. మతోన్మాద బీజేపీ సర్కారును గద్దె దించుదాం అని పిలుపునిచ్చారు. రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి రెండోసారి పార్లమెంటుకు పంపించాలని రాజశేఖర్ రెడ్డి ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.