పేదల పక్షపాతి కాంగ్రెస్
డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి
పటాన్చెరు ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): దేశంలో పేదల పక్షాన నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మాల జగ్గారెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లారం గాంధీ సెంటర్ కార్నర్ మీటింగ్ లో నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడారు.ఈ దేశానికి ఇందిరా చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలోనే మెదక్ ప్రాంతానికి ఇండస్ట్రీలు, కంపెనీలను నెలకొల్పి ఉపాధికి బాటలు వేశారన్నారు. మోసపూరిత మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మదును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
*ఆలోచించి ఓటేయండి..*
*ఎం పి అభ్యర్థి నీలం మధు*
పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లారం గాంధీ సెంటర్ కార్నర్ మీటింగ్ లో అభ్యర్థి నీలం మధు మాట్లాడారు. బిజెపి, బీఆర్ఎస్ పాలకులు చిన్న హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తూ అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూసిందన్నారు. ఇకపోతే బొల్లారంలో ఎక్కువశాతం కార్మికులే ఇక్కడ నివసిస్తుంటారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనును గెలిపిస్తే ఇక్కడే గ్రామ సభలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటానన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను సైతం తీరుస్తానని హామీ ఇచ్చారు. ఒక్కసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సందర్భంగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అనంతరం బొల్లారం అంబేద్కర్ యువజన సంఘం ఎంపీ అభ్యర్థి నీలం మదును ఘనంగా సన్మానించారు. అంతకుముందు కిష్టారెడ్డిపేట్ నుండి ర్యాలీగా బయలుదేరిన నీలం మధు ఎన్నికల ప్రచారం బొల్లారం నుంచి స్థానిక గాంధీ సెంటర్ వరకు కొనసాగింది. సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, పటాన్చెరువు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, బొల్లారం వైస్ చైర్మన్ అంతిరెడ్డి గారి అనిల్ రెడ్డి,చంద్ర రెడ్డి, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డిలతో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు వాహనాలతో ర్యాలీగా ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి,వరప్రసాద్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శంకర్ లతా సంతోష్,గోపాల్, రమణయ్య, గోపమ్మ, పరుశురాం, ఇమ్రాన్, బొల్లారం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.