Praja Kshetram
పాలిటిక్స్

దూకుడు పెంచిన బీఆర్ఎస్ నాయకులు

దూకుడు పెంచిన బీఆర్ఎస్ నాయకులు

మొయినాబాద్ ఏప్రిల్ 30 (ప్రజాక్షేత్రం):లోక్‌సభ ఎన్నికల వేళ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకై బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో దూకుడు పెంచారు.మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, ఎత్తుబారుపల్లి, తోల్కట్ట గ్రామాలలో డోర్ టు డోర్ ప్రచారం బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత రెడ్డి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఆరు గ్యారెంటీలలో ఒక పథకాన్ని కూడా సరిగా అమలు చేయకుండా ముందు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసి గ్రామాలలో రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీకాంత్, జేవంత్ నక్షత్రం, మొర శ్రీనివాస్ ,నరసింహ గౌడ్ ,శ్రీహరి గారు, మాణిక్ రెడ్డి, డప్పు రాజు, దారెడ్డి వెంకటరెడ్డి, బసవపురం ఆంజనేయులు గౌడ్ ,రాజు, ప్రవీణ్ రెడ్డి ,వెంకటయ్య, దర్గా రాజు ,శ్రీకాంత్ గౌడ్, తిరుపతి రెడ్డి ,రవీందర్ మరియు వివిధ గ్రామాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts