Praja Kshetram
క్రైమ్ న్యూస్

భోజనం రుచిగా లేదని భార్యను హత్య చేసిన కసాయి భర్త

భోజనం రుచిగా లేదని భార్యను హత్య చేసిన కసాయి భర్త

 

హైదరాబాద్ ఏప్రిల్ 30 (ప్రజాక్షేత్రం): వంట రుచి గా చేయడం లేదని భార్యను హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. భోజనం బాగోలేదని భార్య ను భర్త కొట్టించంపాడు. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలోని ప్రగతి బిల్డింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. మధ్య ప్రదేశ్ కు చెందిన భార్య భర్తలు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నా రు. వంట బాగోలేదని భార్య రవినాదూబే(26)ని భర్త ఇటుకతో కొట్టాడు. తలకు బలమైన గాయాలు కావ డంతో భార్య ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Related posts