Praja Kshetram
పాలిటిక్స్

బీజేపీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం. మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల

బీజేపీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం.

మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల

హైదరాబాద్ ఏప్రిల్ 30 (ప్రజాక్షేత్రం): బీజేపీతోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం మల్కాజిగిరికి చెందిన టీడీపీ నాయకులు, అడ్వకేట్‌ సుధీర్‌, ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ మల్కాజిగిరి ఉపాధ్యక్షుడు రాకేష్‌ తదితరులు ఈటల సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మోహన్‌యాదవ్‌, భాను, కృష్ణ, శ్రీలతరెడ్డి, దీప్తి, సంధ్య, వేణు, మహే్‌షయాదవ్‌, రాజశేఖర్‌, మహేందర్‌ పాల్గొన్నారు.

బీజేపీని గెలిపించాలి

మౌలాలి డివిజన్‌లోని అక్షిత అపార్ట్‌మెంట్‌లో కార్పొరేటర్‌ గున్నాల సునీతాయాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున విచ్చేసి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసుదేవరావు, డివిజన్‌ అధ్యక్షుడు అనిపెద్ది సాయిబాబు, లింగరావు, మురళీకృష్ణ, జగదీష్ యాదవ్‌, కిరణ్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌… కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తెలిపారు. మండలంలోని కచవానిసింగారం, సుప్రభాత్‌టౌన్‌షిప్‏లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‏కు చెందిన మాజీ సర్పంచ్‌ కొంతం వెంకట్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఈటల రాజేందర్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… మోదీ గ్యారంటీతో దేశంలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు, ప్రధానకార్యదర్శి ప్రభంజన్‌గౌడ్‌, కౌన్సలర్‌ గొంగ్గళ్ళ మహేష్‌, నాయకులు అచ్చిని నర్సింహ, బసవ రాజుగౌడ్‌, శివరాజ్‌గౌడ్‌, సురేష్‌, శంకర్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రామంతాపూర్‌:
రామంతాపూర్‌లో ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్‌ ఇంటింటికి తిరుగుతూ ఈటలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వారితో పాటు రామంతాపూర్‌ కార్పొరేటర్‌ బండారు శ్రీనివాణి వెంకట్‌రావు, కౌన్సిలర్‌ రావుల రవీందర్‌గౌడ్‌, సీనియర్‌నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణనగర్‌, రామంతాపూర్‌ డివిజన్‌, 265 బూత్‌ పరిధిలో మంగళవారం బూత్‌ అధ్యక్షుడు పదిగం బాలాజీ, కో ఆర్డినేటర్‌ నాగేస్‌ ఆధ్వర్యంలో రామంతాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీవాణి వెంకట్‌రావు మహిళా కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు.

Related posts