Praja Kshetram
తెలంగాణ

తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్‌

తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌ ఏప్రిల్ 30(ప్రజాక్షేత్రం): తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎక్స్‌(ట్విటర్‌)లో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్‌లో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు. మొన్న సూర్యాపేట, నిన్న మహబూబ్‌నగర్‌, ఇవాళ ఓయూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే నెలపాటు హాస్టళ్ల మూసివేతకు నోటీసు ఇచ్చారు. అందులో విద్యుత్‌, నీటి కొరత  గురించి ప్రస్తావించారు.మేం వచ్చాకే మూసేస్తున్నట్లు చెప్పడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ఠ’’ అని రేవంత్‌ విమర్శించారు.

Related posts