పదవ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన* విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి
అలంపూర్ ఎమ్మెల్యే కె.విజయడు.
అలంపూర్ మే 01(ప్రజాక్షేత్రం):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఇంటర్ మీడియట్ దశ మీ జీవితంలో మలుపు తిరిగే దశ మంచి మార్గం వైపుగా వెళ్ళాలి చెడు వ్యసనాలకు బానిసలూ కాకుండా జీవితంలో ఒక లక్ష్యం నిర్ణహించుకొని లక్ష్యం సాదించే దిశగా భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదిగేవిధంగా నిర్ణయం తీసుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొనే విదంగా ఉన్నతమైన చదువులు చదివి అలంపూర్ ప్రాంతానికి, మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు.