నేడు తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారం
హైదరాబాద్ మే 01 (ప్రజాక్షేత్రం):
లోక్‌సభ ఎన్నికల ప్రచార నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. నేడు ఆయన హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక విమానంలో బేగం పేటకు రానున్న అమిత్ షా…హైదరాబాద్ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా ప్రచారం నిర్వహించను న్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు లాల్‌ద ర్వాజలో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు.
అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.
మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు…బీజేపీ పదేళ్ల పాలనను ఇంటింటికి వివరించేలా నేతలకు మార్గనిర్దేశనం చేయనున్న ట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి.
భేటీ అనంతరం బేగంపేట లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేయను న్నారు. తిరిగి మరునాడు ఉదయం దిల్లీకి పయనం కానున్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో పార్టీ వర్గాలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు రోడ్ షో కోసం పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.