Praja Kshetram
తెలంగాణ

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప

కార్మికులు నిరంతరం హక్కుల కోసం పోరాటం చేయాలి

ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి

ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ

 

చేవెళ్ల మే 01(ప్రజాక్షేత్రం):138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలో ఏఐటీయూసీ చేవెళ్ల మండల సమితి మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి హాజరై ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు అదేవిధంగా అనేక్స్ గ్లాస్ కంపెనీ దగ్గర ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ కార్మికులతో కలిసి ఏఐటియుసి జండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 గంటల పని విధానమ పోయి ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్నదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని పేర్కొన్నారు అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన దోపిడీ మొదలు పెట్టాడని కార్మికులను బానిసలుగా చేసే చట్టాలను తీసుకువస్తున్నాడని కార్మికులు స్వాతంత్రం రాక ముందే బ్రిటిష్ కాలంలోనే 44 రకాల చట్టాలను పోరాడి సాధించుకున్నారని మోడీ వచ్చిన తర్వాత పెట్టుబడిదారికి తలొగ్గి నాలుగు కోడలుగా మార్చి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో మోడీ వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు 100% పెరిగాయని పేదవాడు ఇంకా పేదవాడుగా మారిపోయాడని ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారిపోయారని ఆదాని అంబానీ ఆస్తులు కొన్ని వందల రెట్లు పెరిగిపోయాయని మోడీ ప్రభుత్వం బడా బాబులు బ్యాంకుల నుండి తీసుకున్న లక్షల కోట్లరూపాయలను మాఫీ చేసిందని అదేవిధంగా రోజురోజుకు ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుందని పేదరికం నాలుగు శాతం పెరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు కార్మికులంతా ఐకమత్యంగా ఉండి హక్కుల కోసం సమరసిల పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏం ప్రబు లింగం కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు బి సుభాన్ రెడ్డి బి కే ఎం యు జిల్లా అధ్యక్షుడు అంజయ్య మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి సహాయ కార్యదర్శి ఎం డి మక్బూల్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు శివ మండల కార్యదర్శి డప్పు శివయ్య మండల మహిళా సంఘం అధ్యక్షురాలు వడ్ల మంజుల మండల ఏఐటీయూసీ నాయకుడు యాదగిరి ఆనందం మురళి లలిత సుగుణమ్మ యాదమ్మ రమాదేవి బిఓసి నాయకుడు శ్రీనివాస్ కార్మికులు మాధవరెడ్డి ఇంద్రారెడ్డి సూరి శ్రీనివాస్ జైపాల్ రెడ్డి రంజిత్ మల్లారెడ్డి శ్రీను కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts