Praja Kshetram
తెలంగాణ

కాంగ్రెస్ లో చేరిన పెద్ద మంగళారం నాయకులు

కాంగ్రెస్ లో చేరిన పెద్ద మంగళారం నాయకులు

 

మొయినాబాద్ మే 01(ప్రజాక్షేత్రం): మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు పలువురు నాయకులు చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మరియు చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు మరియు గ్రామానికి సంబందించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమలు అందచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో కొనసాగాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద మంగళవారం మాజీ సర్పంచ్ కోట్ల నరోత్తం రెడ్డి, పాటి కృష్ణారెడ్డి,సుధాకర్ గౌడ్, చిన్నషాపురం ఉపేందర్ రెడ్డి, పి సురేష్ కుమార్, ఎస్ నాగరాజు, కే సాయిలు, రామ్ రెడ్డి, ములుగు శ్రీనివాస్ గౌడ్, ఖలీల్ బాయ్, మాణిక్యం రెడ్డి, సరికొండ సురేందర్ రెడ్డి, సరికొండ మాణిక్యం రెడ్డి,బొడ్డు మల్లరెడ్డి, బొక్క మల్లారెడ్డి, రామకృష్ణ గౌడ్,హనుమంత్ మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts