Praja Kshetram
పాలిటిక్స్

పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం సంపూర్ణ మద్దతు

సిపిఎం చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి అల్లి దేవేందర్

చేవెళ్ల మే 05 (ప్రజాక్షేత్రం): దేశంలో మతోన్మాద బిజెపి ని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి ఏర్పాటయింది అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేనా భీమ్ భారత్ ని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డిని చేవెళ్ల పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డిని డిసిసి ఉపాధ్యక్షులు బండారి ఆగి రెడ్డిని టిపిసిసి రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి గారిని పిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారిని దామరగిద్ద మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్తాని సిపిఎం నియోజకవర్గ ఇన్చార్జ్ అల్లి దేవేందర్ ఆధ్వర్యంలో కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా అల్లి దేవేందర్ మాట్లాడుతూ ఇండియా కూటమిలో సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తుందని దేశంలో ఆర్ఎస్ఎస్ బిజెపి మతోన్మాద శక్తులను అడ్డుకోవాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు చేవెళ్ల నియోజకవర్గం లో సిపిఎం పార్టీ సభ్యులు పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు శ్రేయోభిలాషులు సిపిఎం పార్టీ అనుబంధ ప్రజా సంఘాలైన కార్మిక రైతు సంఘం విద్యార్థి సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అన్ని ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా సిపిఎం పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శంకర్పల్లి మండల కార్యదర్శి మల్లారెడ్డి మొయినాబాద్ మండల నాయకులు ప్రభుదాస్ సాయిబాబా చేవెళ్ల మండల నాయకులు నరసింహ షాబాద్ మండల నాయకులు లక్ష్మయ్య నరసింహ తదితరులు పాల్గొన్నారు

Related posts