ఏపీ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా నియామకం
అమరావతి మే 06 (ప్రజాక్షేత్రం):
ఏపీ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది.
ఈ మేరకు సీఎస్ జహర్ రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ, బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమిం చేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది.
సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీ. మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్‌కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్‌కుమార్ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.