Praja Kshetram
తెలంగాణ

మాదిగలకు మద్దతుగా నిలిచిన బీజేపీ కి ఓటు వేసి గెలిద్దాం.

గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఇంటింటి ప్రచారం.

*మాదిగలను విస్మరించిన పార్టీ కాంగ్రెస్ నీ రాజకీయంగా భూస్థాపితం చేస్థం.*

*కాంగ్రెస్ అంటే కాలయాపన పార్టీ…ప్రజా సమస్యలు పట్టని పార్టీ.*

*ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒక్క ఎంపీ సీటు రణీయ్యొద్దు.*

మాదిగలకు మద్దతుగా నిలిచిన బీజేపీ కి ఓటు వేసి గెలిద్దాం.

*బిజెపి తోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యం..*

*చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కై.. ఎమ్మార్పీఎస్ ఇంటింటి ప్రచారం…*

*ఎమార్పిఎస్ షాబాద్ మండల ఇన్చార్జి కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ*

షాబాద్ మే 09 (ప్రజాక్షేత్రం): సోమవారం షాబాద్ మండల మన్ మర్రి,అంతారు, సర్ధార్ నగర్, కక్కులూర్ గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బిజెపి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఎం ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భాను ప్రసాద్ మాదిగ ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ షాబాద్ మండల ఇన్చార్జి కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ
30 ఏళ్ల మాదిగల కళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ను సాకారం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి గెలుపుకై షాబాద్ గ్రామల్లో ఎమ్మార్పీఎస్ ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యంలో బీజెపీ గెలుపు మాదిగల గెలుపుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన మోసాన్ని మాదిగలు తిప్పి కొడతారని ఈ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్తామని అన్నారు.జనాలని నమ్మించి గొంతుకోసే కాంగ్రెస్ పార్టీనీ ఓడగొట్టాలని ప్రజల కోసం శ్రమించే నరేంద్ర మోడీ గారిని మళ్లీ ప్రధాని చేయాలని ఓటర్లను నాయకులు కోరారు. మాదిగలంతా మే 13న బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఎమ్మార్పీఎస్ హరిష్,నందు, మహేష్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts