Praja Kshetram
పాలిటిక్స్

వేముల గ్రామంలో జోరుగా పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

వేముల గ్రామంలో జోరుగా పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎర్రవల్లి మే10(ప్రజాక్షేత్రం):
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఎర్రవల్లి మండల పరిధిలోని వేముల గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు… కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలుపరిచే యువ న్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం,సామాజిక న్యాయం 5 హామీల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్ మహాశయులకు వివరించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లన్న,శ్యామ్,సుందర్,బాబు,రాజు,సురేష్,నాగరాజు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts