Praja Kshetram
తెలంగాణ

శంకర్‌పల్లిలో బిఆర్ఎస్ కు బిగ్ షాక్…బిజెపిలో చేరిన ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి

శంకర్‌పల్లిలో బిఆర్ఎస్ కు బిగ్ షాక్…బిజెపిలో చేరిన ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి

 

శంకర్‌ పల్లి మే 11 (ప్రజాక్షేత్రం): ఎన్నికలవేళ టిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శంకర్‌ పల్లి మండల ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి శనివారం బిజెపి పార్టీలో చేరారు. వికారాబాద్ లో జరిగిన హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే
కెఎస్ రత్నం ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఎంపీపీకి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు నచ్చే పార్టీలో చేరానని చెప్పారు. ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రెండోసారి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీపీతో పాటు మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, చందిప్ప ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, సంకెపల్లి ఎంపీటీసీ, నాయకులు దండు రామ్మోహన్, పటోళ్ల శేఖర్ రెడ్డి సంతోష్ కుమార్ బిజెపిలో చేరారు. కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రాములు గౌడ్, వాసుదేవ్ కన్నా, సురేష్ యాదవ్, అజయ్ గౌడ్, సతీష్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, హేమంత్ రెడ్డి, కార్తీక్ రెడ్డి ఉన్నారు.

Related posts