Praja Kshetram
జాతీయం

బీజేపీ గెలిస్తే.. యోగి రాజకీయ జీవితం రెండు నెలల్లో అంతం: అరవింద్ కేజ్రీవాల్

బీజేపీ గెలిస్తే.. యోగి రాజకీయ జీవితం రెండు నెలల్లో అంతం: అరవింద్ కేజ్రీవాల్

 

న్యూఢిల్లీ మే12 (ప్రజాక్షేత్రం): బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ శనివారం తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజకీయ జీవితం రెండు నెలల్లో అంతమవుతుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలనే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా బీజేపీ జైల్లో పెడుతుందని కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ ప్లాన్‌ను ప్రారంభించారని, త్వరలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని కూడా ముగించబోతున్నారని చెప్పారు. ‘అద్వానీ, మురళీ జోషి, శివరాజ్ చౌహాన్, వసుంధరా రాజే, ఖట్టర్, రమణ్ సింగ్‌ల రాజకీయాలు ముగిశాయి. యోగి ఆదిత్యనాథ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆయన (పీఎం మోదీ) గెలిస్తే రెండు నెలల్లో యూపీ సీఎంను మారుస్తారు’ అని అన్నారు.

Related posts