హైదరాబాద్: వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది.

next post