సొంత గ్రామంలో ఓటు వేసిన పామేన భీం భరత్
చేవెళ్ల మే13(ప్రజాక్షేత్రం):చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే,చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీం భరత్ షాబాద్ మండలంలోని తన సొంత గ్రామంలో తన అమూల్యమైన ఓటు హక్కును దిగ్విజయంగా ఈరోజు వినియోగించుకున్నారు.పామేన భీం భరత్ రావటంతో అయన అభిమానులు, ప్రజలు అమితమైన ఉత్సాహన్ని కనబర్చారు.సమానత్వం కోసం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రజలందరూ ఓటు వేసేందుకు తప్పక కదిలిరావాలని పామేన భీం భరత్ పిలుపునిచ్చారు.అయనతో పాటుగా నరెడ్లగూడ మాజీ సర్పంచ్ ముక్కు రవికుమార్,మిట్ట రాంరెడ్డి,బాల్ రాజ్, రంగయ్య,మల్రెడ్డి,అనిల్,శ్రీనివాస్,కృష్ణ,పరమేష్,జంగయ్య ప్రవీణ్ లు కూడా ఓటు వేశారు.