Praja Kshetram
తెలంగాణ

మంత్రి పొంగులేటి..ఎమ్మెల్యేలు వేళ్లే విమానంలో సాంకేతిక లోపం

మంత్రి పొంగులేటి..ఎమ్మెల్యేలు వేళ్లే విమానంలో సాంకేతిక లోపం

*– శబరిమలై వెళుతున్న మంత్రి, ఎమ్మెల్యేలు పాయం, తెల్లం, జారే*
*– రన్ వే మీదకు వెళ్తుండగానే లోపాన్ని గుర్తించిన ఫైలెట్*
*– వెంటనే రిపేర్.. కదలాగానే మరోసారి లోపం*
*– రెండు గంటలుగా శంషాబాద్ విమాశ్రయంలోనే..!*

ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి మే 14 (ప్రజాక్షేత్రం): నాల్గో దశ లోక్‌సభ ఎన్నికలు సోమవారం ముగియడంతో శబరిమలై అయ్యప్పస్వామి దర్శనానికి బయలుదేరిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పయనించే ఇండిగో ప్లైట్ కు సాంకేతిక లోపం తలెత్తింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం మంగళవారం ఉదయం 9 .55 గంటలకు బయలుదేరే ఇండిగో ఫ్లైట్ ను మంత్రి తోపాటు పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు బుక్ చేసుకున్నారు. గంట ముందుగానే ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. చెక్ ఇన్ అంతరం తోటి ప్రయాణీకులతో పాటు ఫ్లైట్ ఎక్కారు. కానీ అంది ఎయిర్ పోర్ట్ లోనే మొరాయించింది. రన్ వే మీదకు వెళ్తుండగానే లోపాన్ని గుర్తించిన ఫైలెట్ దానిని రిపేర్ చేయించారు. కదలాగానే మరోసారి లోపం తలెత్తడంతో మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య రెండు గంటలుగా ఎయిర్ పోర్టులోనే వేచి ఉన్నారు.

Related posts