మరో నాలుగు రోజులు వర్షాలు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈనెల 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది.