బ్రెయిన్ డెడ్… ఐదుగురి జీవితాల్లో వెలుగు.
వనపర్తి మే 16 (ప్రజాక్షేత్రం): వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండలం కంబలాపురంలో ఓ తల్లి తాను చనిపోయి మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. లక్ష్మీ దేవమ్మ (42) ఈనెల 5న కొడుకుతో కలిసి బైక్ పై వెళ్తుండగా మరో వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె నిమ్స్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ తో చనిపోయారు. ఈ క్రమంలో జీవన్ దాన్ వైద్య బృందం ఆమె భర్త, కుటుంబీకులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి.