Praja Kshetram
తెలంగాణ

హైదరాబాద్ సిటీ ని కమ్మేసిన మేఘాలు భారీ వర్షం అలర్ట్

హైదరాబాద్ సిటీ ని కమ్మేసిన మేఘాలు భారీ వర్షం అలర్ట్

 

హైదరాబాద్ మే 16 (ప్రజాక్షేత్రం): సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం అయ్యింది. ఉదయం నుంచి ఉక్కబోత, వేడిగాలులతో ఉన్న వెదర్.. మధ్యాహ్నం 2 గంటల సమయానికి చల్లబడింది.
హైదరాబాద్ సిటీ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. గురువారం సాయంత్రం భారీ వర్షం పడనుందని హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.
గురువారం సాయంత్రం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడనుందని.. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. క్యుములో నింబస్ మేఘాలు ఆవరించాయని.. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడనుందని హెచ్చరించింది వెదర్ డిపార్ట్ మెంట్. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

Related posts