Praja Kshetram
తెలంగాణ

రైతాంగ వ్యతిరేక చర్యలు అంటూ బిఆర్ఎస్ గగ్గోలు విడ్డూరంగా వుంది.

రైతాంగ వ్యతిరేక చర్యలు అంటూ బిఆర్ఎస్ గగ్గోలు విడ్డూరంగా వుంది.

బీఆర్ఎస్ పై జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి ఆగ్రహం.

కందుకూరు మే 16 (ప్రజాక్షేత్రం): గురువారం మండల కేంద్రములో విలేకరుల సమావేశం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ,,,రైతు సమస్యలు పక్కనపెట్టి రాజకీయాలా అంటూ బిఅర్ఎస్ నాయకులు గగ్గోలు పెట్టడం చూస్తేంటే విడ్డూరంగా వుందని అన్నారు.బిఅర్ఎస్ పార్టీ అధికారం లో వున్నప్పుడు కెసిఅర్ పదేళ్ళ పాలనలో నాడు ధాన్యం తడిస్తే కొనే దిక్కులేదు, అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే పైసా సహాయం లేదు,పంటల బీమా పథకం లేదు,ఖమ్మంలో మిర్చి ధర అడిగినందుకు గిరిజన రైతులకు బేడీలు, వరంగల్ లో పత్తి రైతుల ఆత్మహత్యల గోస విన్నది లేదు,నాడు ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 8వేల పై చిలుకు రైతులు నాటి ప్రభుత్వంలో చలనం లేదన్నారు.రైతులకు ఎరువులు ప్రీ అని మోసం చేసి మొండిచెయి చూపితే తప్పులేదు.2018 ఎన్నికల మ్మానిపెస్టోలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి 2023 ఆగస్టు వరకు దాని ఊసే ఎత్తకుండా ఎన్నికలు వస్తన్నాయని మొదలు పెట్టిన రుణమాఫీ రైతులకు చేరేనే లేదని దుయ్యాబట్టారు.రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలు బంద్ చేస్తే తప్పులేదు,వరి వెస్తే ఉరేనని రైతులను బెదిరిస్తే అన్యాయం అన్నోడు లేడు,కాంట కాడ దళారుల చేతివాటంతో క్వింటల్ కు 10 కిలోల తరుగు పేరుతో దోచినా ఏనాడు పట్టించుకోని బిఅర్ఎస్, సివిల్‌ సప్లై కార్పొరేషన్ లో 56 వేల కోట్ల అప్పుల పాలు చేసిన బిఅర్ఎస్ ప్రభుత్వం ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ అరోపనలు చేయడం సిగ్గు చెటన్నారు.100 రోజుల కాంగ్రెస్ పాలనలోనే రైతు భరోసా రూ.7,500 కోట్లు వేసి, ఆగస్టు 15 లోపు రైతుకు రూ.2 లక్షల రుణమాఫీకి కార్యచరణ ప్రకటించి,వచ్చే పంట నుండి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇచ్చినా పంటల బీమాకు శ్రీకారం చుట్టినా ప్రతి పంటకు మద్ధతు ధర ఇవ్వడానికి సిద్ధమైనా ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడానికి నిరసనలు తెలపడానికి సిగ్గుపడాలి అని పాండురంగా రెడ్డి అన్నారు.

Related posts