*ఇక్పాయి కాలేజీలో యాసిడ్ కలకలం.*
– *క్లీనింగ్ కోసం యాసిడ్ కలిపి పెట్టుకున్నారు అని కొందరు….*
– *వేడి నీరు పోసుకుంది అని కొందరు…*
– *వేడి నీరు అయితే ఇంతలా కాలదు అని కొందరి వాదన…*
– *క్లీనింగ్ యాసిడ్ అయితే ఇంతలా శరీరం కాలదు అని మరికొందరు….*
– *అసలు నిజాలు ఇంటరాగేషన్ లో తెలుస్తుంది అన్న పోలీసులు….*
– *తెలియక నీళ్లు అనుకొని పైన పోసుకున్న విద్యార్థి.*
శంకర్ పల్లి మే 16 (ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం యాసిడ్ కలిపిన నీటిని విద్యార్థిని తనపై పోసుకోవడం తో గాయాలు అయినా ఘటన ఇక్పాయి కాలేజ్ లో జరిగింది. మోకిలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 4వ సంవత్సరం చదువుతున్న లేఖ్య అనే విద్యార్థి స్నానం చేయడానికి బాత్రూం లోకి వెళ్లి నీరు తన పైన పోసుకుంది.అయితే బకెట్లో
హౌస్ కీపింగ్ పనుల నిమిత్తం బకెట్ లో యాసిడ్ కలిపి ఫ్లోర్ క్లీన్ చేయగా మిగిలిన యాసిడ్ ని బకెట్ లోనే ఉంచడం జరిగింది అని అది తెలియక అమ్మాయి అవే వాటర్ నీ తనమీద పోసుకోవటంతో శరీరం మండి బొగ్గలు వచ్చాయి అని కొందరు వేడి నీరు పోసుకోవడం వల్లనే అని పోలీసులు చెబుతున్నారు. ఇది గమనించిన తోటి విద్యార్థినులు, సిబ్బంది ఆమెని నగరం లోని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించడం జరిగింది అని వివరణ ఇచ్చారు. ఈ ఘటన పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేడి నీళ్లు అని కొందరు, క్లీనింగ్ కి వాడే యాసిడ్ అని కొందరు అంటున్నారు . అయితే వేడి నీళ్లు అయినా క్లీనింగ్ కి వాడే యాసిడ్ అయినా ఇంతలా శరీరం కాలదు అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పోలీస్ విచారణలో అన్ని తెలుస్తాయి అని పలువురి అభిప్రాయం.