ప్రభుత్వాలు మారిన మారని రోడ్లు
ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వలన తరచూ ప్రమాదాలు
శంకర్ పల్లి మే 18 (ప్రజాక్షేత్రం):
శంకర్ పల్లి మండలం పరిధిలో పర్వేద గ్రామం మూల మలుపున శనివారం ఉదయం నాలుగు గంటల సమయానికి వికారాబాద్ నుండి హైదరాబాద్ పోయే క్రమంలో పర్వేద మూలమలుపులో ఇటీవలే వేసిన రోడ్డుకు స్పీడ్ బ్రేకర్స్ సూచిక బోర్డులు లేనందువలన మూలమలుపులో చెట్టుకు ఢీకొట్టడంతో రోడ్డు అవతల ఇనోవా కారు బోల్తా పడింది. కారులో ముగ్గురు ప్రయాణికులు ఉండగా వారికి కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పర్వేద మాజీ వార్డ్ మెంబర్ మాట్లాడుతూ పర్వేద రోడ్డులో ఇప్పటికీ ఈ రోడ్డు వేసి ఏడు సంవత్సరాలు ముగించిన ఇప్పటివరకు ఈ రోడ్డుకు స్పీడ్ బ్రేకర్స్ సూచిక బోర్డులు లేనందువలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న వినిపించుకున్న పాపాన పోలేదు అటు అధికారులు ఇటు నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడం వలన ఎన్నో కుటుంబాలు అవిటి వాళ్ళు వితంతువులు తయారవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.