Praja Kshetram
తెలంగాణ

ఈనెల 20 న లాటరీ పద్ధతి ద్వారా నియామక ప్రక్రియ: జిల్లా కలెక్టర్

ఈనెల 20 న లాటరీ పద్ధతి ద్వారా నియామక ప్రక్రియ: జిల్లా కలెక్టర్

 

జోగుళాంబ గద్వాల మే 18 (ప్రజాక్షేత్రం): జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నందు ఔట్ సోర్సింగ్ ఖాళీల నియామకము కొరకు డాటా ఎంట్రీ ఆపరేటర్ – 11, ఆఫీస్ సబార్డినెట్ – 09, ల్యాబ్ అటెండెంట్ – 03, థియేటర్ అసిస్టెంట్ – 01 కోరకు ప్రకటన జారీ చేయగా, జోగుళాంబ గద్వాల జిల్లా స్థానికులకు మాత్రమే పరిగణలోకి తీసికొని అర్హుల నుండి వచ్చిన దరఖాస్తుల వివరములు సంబంధించిన జాబితా క్రింది విధంగా విడుదల చేసినట్లు జిల్లా సెలక్షన్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ 672,ఆఫీస్ సబార్డినెట్ 1483,ల్యాబ్ అటెండెంట్ 201,థియేటర్ అసిస్టెంట్14 చొప్పున మొత్తం 2370 సేకరించడం జరిగిందని, అర్హులైన దరఖాస్తుదారులకు సంబంధించిన తుది జాబితా ఈరోజు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈనెల 20 తేదీన ప్రతి పోస్టుకు సంబంధించి లాటరీ ద్వారా పాత ఎంపీడీఓ కార్యాలయం, జోగుళాంబ గద్వాల జిల్లా నందు తీయడం జరుగుతుందని, ఇట్టి విషయాన్ని దరఖాస్తుదారులు గమనించగలరని ఆయన ప్రకటనలో తెలిపారు.

Related posts