ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ దినేష్ కుమార్
చేవెళ్ల మే 18 (ప్రజాక్షేత్రం): గురువారం హైదరాబాద్ దస్పల్ల హోటల్లో అన్ని నియోజకవర్గాల నుండి వచ్చిన సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్ తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి లంచ్ చేసి ఫోటో సెషన్ నిర్వహించారు.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల నుండి అసెంబ్లీ ఇన్చార్జి దినేష్ కుమార్ మరియు వారి మిత్రబృందం తదితరులు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ గారు మాట్లాడుతూ.. సోషల్ మీడియా వారియర్స్ తోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. వారి ముందు గౌరవంగా చెప్పుకుంటున్నాను అన్నారు.. ప్రజా పాలనలో సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ముందు వరుసలో వుండీ అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రతి ఒక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ దయాకర్ రెడ్డి,చేవెళ్ల అసెంబ్లీ కో-కో ఆర్డినేటర్ మాణిక్యం,మండల కోఆర్డినేటర్లు అస్లాం,బురాన్ సురేష్,వేణు మరియు తదితరులు పాల్గొన్నారు.