కళ్యాణలక్ష్మి పథకానికి రూ.725 కోట్లు విడుదల.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ మే 19 (ప్రజాక్షేత్రం):
తెలంగాణ రాష్ట్రంలోనిపేద వర్గాల వివాహా ఖర్చుల చెల్లింపుకు సంబంధించి రూపొందించిన కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం రూ. 725 కోట్ల నిధులను విడుదల చేసింది.ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షే మశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం కూడా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.గత ప్రభుత్వం కేవలం రూ. లక్ష నగదు మాత్రమే ఇచ్చేది. కానీ, నగదుకు అదనంగా తులం బంగారం కూడా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే.