Praja Kshetram
తెలంగాణ

నేటి నుంచి యాదాద్రిలో నరసింహుడి జయంతి ఉత్సవాలు

నేటి నుంచి యాదాద్రిలో నరసింహుడి జయంతి ఉత్సవాలు

 

యాదాద్రి మే 20 (ప్రజాక్షేత్రం):
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ యాదాద్రి శ్రీ పాంచనార సింహుడి సన్నిధిలో నేటి నుంచి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారు లు తెలిపారు.ఇవాళ ఉదయం 8:30 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం చేసినట్లు ఆలయ ప్రధాన పూజారి నల్లందిగల్‌ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. సోమవారం సాయంత్రం జరిగే అంకురార్పణ క్రతువులతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. స్వామి వారి జయంతి ఉత్సవాల నేపథ్యంలో యాదాద్రికి భారీగా భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు.

Related posts