Praja Kshetram
తెలంగాణ

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

 

 

ఖమ్మం మే 20 (ప్రజాక్షేత్రం):ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహించారు.ఈ క్రమంలోనే బేడా అటవీ ప్రాంతంలో మావోలు.. పోలీసులకు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే వారు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు.దీంతో వెంటనే జవాన్లు కూడా మావోయిస్టుల పై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. అటవీ ప్రాంతం మొత్తం తుపాకి శబ్దాలతో దద్దరిల్లిపోయింది.కాగా ఈ కాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా మరో జవాన్ కు తీవ్రగాయా లయ్యాయి. ఈ ఎదురుకా ల్పులు ఇంకా కొనసాగుతు న్నట్లు తెలుస్తోంది.కాగా ఈ ఘటనకు సంబం ధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

Related posts