మళ్లీ తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత
న్యూ ఢిల్లీ మే 20 (ప్రజాక్షేత్రం):ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ మళ్ళీ పొడిగించారు.నేటితో కవిత రిమాండ్ ముగియడంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు.కాగా మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఆరెస్ట్ చేశారు.. అనంతరం ఆమె ను ఢిల్లీకి తరలించారు.అప్పటి నుంచి ఆమె జ్యుడి షియల్ కస్టడీలో కొనసాగు తున్నారు.తిహార్ జైలులో ఆమెను ఉంచారు.