సిట్ వేస్ట్.. జ్యుడీషియల్ విచారణ కావాలి:సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ_
హైదరాబాద్ మే 21 (ప్రజాక్షేత్రం): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో, పోలింగ్ తరువాత ఘర్షణలపై విచారణకు వేసిన సిట్ వేస్ట్, అదొక బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు.కావాలనే రాష్ట్రంలో దాడులు జరిగాయి. ఏపీలోని స్ట్రాంగ్ రూంలోని ఈవీఎంల వద్ద భద్రత లేదు. ఎక్కడా సీసీ కెమెరాలు లేవని నారాయణ ఆరోపించారు.దాడుల్లో నిర్లక్ష్యం వహించిన ఆఫీసర్లను సస్పెండ్ చేసినప్పటికీ.కింద స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉన్న పోలీసులే ఇంకా ఉన్నారని నారాయణ అన్నారు.రాష్ట్రంలో అల్లర్లపై సిట్ కాదు.. జ్యూడీషియల్ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.