Praja Kshetram
తెలంగాణ

గ్రామ అభివృద్దె మా లక్ష్యం •కందవాడ మాజీ ఎంపీటీసీ కేశపల్లి లక్ష్మీ మల్లారెడ్డి.

గ్రామ అభివృద్దె మా లక్ష్యం

•కందవాడ మాజీ ఎంపీటీసీ కేశపల్లి లక్ష్మీ మల్లారెడ్డి.

• స్వంత ఖర్చులు 8లక్షలతో గ్రామ అభివృద్ధి పనులకు శ్రీకారం
అభివృద్ధి పనులతో హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు.

చేవెళ్ల మే 21 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ గ్రామఅభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ కందవాడ గ్రామ అభివృద్దే ధ్యేయంగా,ప్రజల క్షేమం కోసం గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ అభివృద్ధి కోసం సొంత ఖర్చులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కందవాడ మాజీ ఎంపీటీసీ కేశేపల్లి లక్ష్మీ మల్లారెడ్డి. గతంలో కందవాడ ఎంపిటిసి గా ఎన్నో అభివృద్ధి పనులు చేసి గ్రామ ప్రజల మన్ననలు పొందారు.గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా,ఏ అవసరం వచ్చిన నేనున్నానంటూ పిలిస్తే పలికె నాయకుడిగా ప్రజల్లో మెలుగుతున్నారు. కందవాడ గ్రామ అభివృద్ధికి మల్లారెడ్డి తన వంతు కృషి చేస్తూనే,గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో చేస్తున్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ గ్రామంలో 8 లక్షల రూపాయల స్వంత ఖర్చులతో ఐమాక్స్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు.వాటి నెల నెలా 40వేల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చులతో అభివృద్ధి పనులు చేశారు.గ్రామంలోని జీసస్ కల్వరి ప్రార్థన మందిరం దగ్గర జీసస్ విగ్రహాన్ని బహుకరించి క్రైస్తవ సోదరుల మన్ననలు పొందారు. గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముడిమ్యాల పిఎసిఎస్ మాజీ చైర్మన్ బలవంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. మునుముందు పదవి ఉన్నా,లేకపోయినా గ్రామ అభివృద్ధిలో తన వంతు పాత్ర ఉంటుందని తెలిపారు .మల్లారెడ్డి చేస్తున్న అభివృద్ధిపనులను చూసి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts