తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి :
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్‌రెడ్డి తెలిపారు
రంగారెడ్డి అర్బన్ మే 21(ప్రజాక్షేత్రం) : వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్యం, పనులు, ప్రణాళిక, ఆర్థిక అంశాలపై జిల్లా అధికారులతో జెడ్పీ చైర్‌పర్సన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ ఎంత మోతాదులో చేశారు. ఎన్ని ఇండ్లు లబ్ధిదారులకు అందించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారని తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా నడుస్తుందని మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రజలతో చర్చించి మరింత సులభతరంగా ప్రయాణం చేయాలని అదికారులకు సూచించారు. వేసవి కాలం కారణంగా గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బంది రాకుండా అఽధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతిలో ఎంతమంది పర్సంటేజ్ వచ్చింది విద్యాశాఖ అదికారులను అడిగి తెలుసుకున్నారు. కొండాపూర్, వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండేటట్టు చూడాలని వైద్యులను ఆదేశించారు. వర్షాకాలంలో పాముకాటు, తేలుకాటుకి గురై ఆసుప్రతికి వచ్చే రోగులకు ఇంజక్షన్స్, మందులు అందుబాటులో ఉండేట్టు చూడాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు రాకుండా విద్యుత్ అధికారులు చూసుకోవాలన్నారు. గ్రామాల్లో అవసరమైన కరెంట్ స్తంభాలు, ఇస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జెడ్పీటీసీలు బొక్క జంగారెడ్డి, మహిపాల్, నిత్య నిరజంన్‌రెడ్డి, అనురాధ, పద్యనాయక్, దశరథ్‌నాయక్, రాగమ్మ, శ్రీలత, అవినా్‌షరెడ్డి, సత్యనారాయణ, వెంకట్రాంరెడ్డి, కో- ఆప్షన్ సభ్యుడు అలీ అక్బర్ ఖాన్, సీఈవో కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో రంగారావు తదితరులు పాల్గొన్నారు.