Praja Kshetram
తెలంగాణ

జనగాం జిల్లాకు వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టాలి : ఏదునూరి నరేష్

జనగాం జిల్లాకు వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టాలి : ఏదునూరి నరేష్

జనగామ జిల్లా మే 22 (ప్రజాక్షేత్రం): జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలిపాక రాములు, అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ,రాష్ట్ర కళామండలి ప్రధాన కార్యదర్శి యామంకి యుగేంధర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏదునూరి వీరన్న హాజరై మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం రజాకర్లపై వీరోచితంగా పోరాడి ప్రపంచ దేశాలను అబ్బురపరిచిన గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ.అంతేకాకుండా దొరలు భూములను తీసుకుని బహుజనులకు లక్షల ఎకరాలు పంచిన వీరవనిత అని వారన్నారు. జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ మాట్లాడుతూ పోరాటాల గడ్డ ఐన జనగామకు చాకలి ఐలమ్మ” జిల్లాగా పేరు పెట్టి ఆమెకు సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ముఖ్యమంత్రివర్యులు ఏ.రేవంత్ రెడ్డి ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరారు. జనగాం జిల్లా కేంద్రంలో ఆధునిక దోబీ ఘాటు నిర్మించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య సలహాదారులు మెంతెన కిష్టయ్య,జిల్లా కార్యదర్శి ఉల్లెంగుల రాజు,జిల్లా సంయుక్త కార్యదర్శి ఉల్లెంగుల చంద్రశేఖర్, బచ్చన్నపేట మండల అధ్యక్షులు కొన్నె వెంకటేష్ తదితరులు హాజరయ్యారు.

Related posts